Vaccination: కరోనా టీకా కోసం కోవిడ్ టెస్ట్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Vaccination: కరోనా టీకా కోసం కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలా? పాజిటివ్ వస్తే వ్యాక్సిన్ తీసుకోవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Vaccination: కరోనా మహమ్మారి విషయంలో ఎన్ని అనుమానాలు ఉన్నాయో.. అంతకంటే ఎక్కువ సందేహాలు టీకా విషయంలో ప్రజలకు ఉన్నాయి. టీకా వేసుకుంటే కరోనా రాదని కచ్చితంగా చెప్పగలరా? అనారోగ్యంతో ఉంటె టీకా వేయించుకోవచ్చా? కోవిడ్ పాజిటివ్ వచ్చి తగ్గిన తరువాత ఎన్నిరోజులకు వ్యాక్సిన్ తీసుకోవాలి? వ్యాక్సిన్ వేసుకున్న తరువాత జ్వరం వస్తే ఏం చేయాలి? ఇలా ఎన్నో ప్రశ్నలు. ఈ అనుమానాల్ నివృత్తి కోసం నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

టీకా వేయించుకోవడం వల్ల కరోనా వస్తుందన్నది అపోహ అంటున్నారు వైద్య నిపుణులు. వ్యాక్సిన్‌ కరోనా మృత కణాలతో తయారు చేస్తారు. ఇది మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వైరస్‌తో పోరాడే యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఈ క్రమంలో కొద్దిపాటి కరోనా వైరస్ సోకిన వారికి వచ్చే లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. అవి ఒకటి రెండురోజులకు తగ్గిపోతాయి. ఏదైనా ప్రత్యెక పరిస్థితులు.. ఇతర కారణాల వల్ల కొంచెం ఎక్కువ అనారోగ్యం కలగవచ్చు తప్పితే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కరోనా వస్తుంది.. అనారోగ్యం కలుగుతుంది అనేది కరెక్ట్ కాదని నిపుణులు చెబుతున్నారు.

ఇంట్లో ఎవరికైనా కరోనా పాజిటివ్ ఉంటె.. ఆ ఇంట్లో ఉన్నవారు టీకా వేయించుకునే ప్రయత్నం చేయకూడదు. కనీసం 14 రోజుల పాటు ఇంటిలో ఐసోలేషన్ (తమకు కరోనా లక్షణాలు లేకపోయినా సరే) ఉండి తరువాత టీకా వేయించుకోవడం మంచింది. ఆ తరువాత కూడా కరోనా టెస్ట్ చేయించుకున్న తరువాతే టీకా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

టీకా వేయించుకోవడానికి వెళ్లినప్పుడు కూడా కనీసం జాగ్రత్తలు తీసుకోవాలి. రెండు మాస్కులను ధరించాలి. అదేవిధంగా ఏదైనా కరోనా లక్షణం అంటే.. జ్వరం..ఒళ్ళు నెప్పులు..జలుబు ఇటువంటివి వుంటే కనుక.. తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలి. నెగెటివ్‌ వచ్చిన తర్వాతే టీకా వేయించుకోవాలి. పాజిటివ్‌ వస్తే ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం టీకా వేయించుకోవడానికి ఆరు నెలలు ఆగాల్సిందే.

చాలా మంది మొదటిడోసు తర్వాత కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. రెండో డోసు వేయించుకున్న 14 రోజుల తరువాతే మనలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయి. దీని తర్వాత కూడా కరోనా రాదని కాదు. చాలా మందికి వచ్చినా కూడా సీరియస్‌ కావడం లేదని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌ తదితర దేశాల్లో రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్న వారిలో పూర్తిస్థాయిలో యాంటీబాడీలు వృద్ధి చెందడంతో అక్కడ మాస్కును పెట్టుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించారు. బ్రిటన్‌లో కూడా అంతే. అందువల్ల ఇక్కడ కూడా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. రెండు దోసులూ తీసుకున్నాక కూడా నిపుణులు సూచించే వరకూ మాస్క్ ధరించాల్సిందే అని చెబుతున్నారు.

ముందే చెప్పినట్టు వ్యాక్సిన్ తీసుకున్నకా స్వల్ప లక్షణాలు కనిపిస్తాయి. అయితే, టీకా వేయించుకున్న తర్వాత ఎక్కువ రోజులు జ్వరం ఇతర లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే, ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకుని ఫలితం ఆధారంగా వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this