Sunday, February 22, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
PM Kisan: రైతులకు కేంద్రం గుడ్‏న్యూస్.. తక్కువ...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

PM Kisan: రైతులకు కేంద్రం గుడ్‏న్యూస్.. తక్కువ వడ్డీకే రుణాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే…

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 PM Kisan Samman Nidhi 2021: కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఎన్నో రకాల పథకాలను తీసుకువచ్చింది. 

వీటి ద్వారా అన్నదాతలకు ఆర్థికంగా ఊరట కల్పిస్తోంది. అయితే ఇందులో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి. ఈ పథకం ద్వారా రైతులకు విడతల వారిగా డబ్బులు జమచేయనుంది. అయితే ఇప్పటికే 7 విడతల వారిగా డబ్బులు అకౌంట్లోకి జమ అయ్యాయి. ఇక మోదీ ప్రభుత్వం ఇటీవలే రూ. 2 వేలను రైతుల అకౌంట్లోకి జమ చేసిన సంగతి తెలిసిందే.

ఈ పీఎం కిసాన్ స్కీమ్‏లో చేరిన రైతులకు కేంద్రం మరో బెనిఫిట్ కూడా అందిస్తోంది. అదే చౌక వడ్డీకి రుణాలను పొందోచ్చు. పీఎం కిసాన్ రైతులు కిసాన్ క్రెడిట్ కార్డులు సులభంగానే తీసుకోవచ్చు. ఈ కేసీసీ కార్డు ఉన్నవారు బ్యాంక్ నుంచి తక్కువ వడ్డీకే లోన్స్ తీసుకునే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. గతేడాది పీఎం కిసాన్ స్కీమ్‏ను కిసాన్ క్రెడిట్ కార్డును లింక్ చేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. దీంతో ఈ పథకంలో ఉన్న ప్రతి రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డు లభిస్తుంది. అలాగే ఈ కేసీసీ కార్డు ఉన్నవారు బ్యాంక్ నుంచి రూ. 3 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. ఇలాంటి రుణాలపై వడ్డీ కూడా కేవలం 4 శాతంగానే ఉంటుంది. రుణాలపై వడ్డీ రేటు 9 శాతంగానే ఉంటుంది. అయితే ఇందులో ప్రభుత్వం నుంచి 2 శాతం సబ్సిడీ ఇస్తుంది. దీంతో వడ్డీ రేటు 7 శాతానికి తగ్గుతుంది. అలాగే రైతులు గడువులోగా లోన్ మొత్తాన్ని చెల్లిస్తే మరో 3 శాతం తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో ఈ తరహా లోన్ తీసుకున్న వారికి 4 శాతం వడ్డీ ఉంటుంది. ఇక ఈ లోన్ కోసం అప్లై చేసుకోవాలన్న.. లేదా కిసాన్ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవాలన్న మీ బ్రాంచ్ బ్యాంకుకు వెళ్లి చేసుకోవచ్చు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this