Men Soft Skin Tips: మహిళలతో పోలిస్తే...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Men Soft Skin Tips: మహిళలతో పోలిస్తే పురుషుల చర్మం చాలా కఠినం..! అందమైన ముఖ తేజస్సు కోసం వీటిని ఫాలోకండి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Men Follow These Tips : పురుషుడి చర్మం మహిళల చర్మానికి భిన్నంగా ఉంటుంది. అతని సంరక్షణ విధానం కూడా భిన్నంగానే ఉంటుంది. కనుక వేసవిలో చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పద్దతులు రెగ్యులర్‌గా పాటిస్తే మీరు యవ్వనంగా, రిఫ్రెష్ గా కనిపిస్తారు.

1. రోజ్ వాటర్ : చాలా మంది పురుషులు ముఖంపై శ్రద్ద చూపరు. దీంతో చర్మం జిడ్డుగా మారి కఠినంగా తయారవుతుంది. ఇలాంటి చర్మాన్ని మృదువుగా చేయడానికి రోజ్ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖంపై ఉన్న ధూళి, దుమ్మును సులభంగా తొలగిస్తుంది.

2. మాయిశ్చరైజర్‌ వాడాలి : మీ చర్మ రకాన్ని బట్టి మాయిశ్చరైజర్ వాడండి. బయటికి వెళ్ళే ముందు, రాత్రి నిద్రపోయే ముందు కచ్చితంగా అప్లై చేయాలి.

3. సన్‌స్క్రీన్‌ను దగ్గర ఉంచండి: చర్మాన్ని వడదెబ్బ నుంచి రక్షించడానికి ఎండలో బయటకు వెళ్ళే ముందు ఎస్పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్ కచ్చితంగా వాడాలి.

4. తగినంత నిద్ర అవసరం: మంచి నిద్ర వల్ల శరీర ఆరోగ్యం, ముఖంలో తేజస్సు పెరుగుతుంది. నిద్ర లేకపోవడం వల్ల అకాల వృద్ధాప్యం సమీపిస్తుంది. కనీసం 8 గంటల నిద్ర కచ్చితంగా అవసరం.

5. ఆహారంపై శ్రద్ధ : ఆకుపచ్చ కూరగాయలు, తాజా పండ్లు, రసాలు, పాలు మీ డైట్‌లో ఉండేవిధంగా చూసుకోండి.

6. ఇంటి నివారణలు: రోజూ పచ్చి పాలతో ముఖ ప్రక్షాళన చేసుకోండి. షేవింగ్ తరువాత, ఆలివ్ ఆయిల్ తో ముఖాన్ని 5 నిమిషాలు మసాజ్ చేయండి. ఇది చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది.

7. నీరు పుష్కలంగా త్రాగండి: ఆరోగ్యకరమైన చర్మం కోసం, శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం. రోజులో 8 నుంచి 10 గ్లాసుల నీరు త్రాగాలి. దీంతో శరీరంలోని అన్ని టాక్సిన్స్ తొలగిపోయి ముఖంపై గ్లో ఉంటుంది.

8. బాడీ వాష్: పురుషులు సబ్బుకు బదులు బాడీ వాష్ ను వాడాలి. ఎందుకంటే సబ్బులో సోడియం హైడ్రాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని పాడు చేస్తుంది. బాడీ వాష్ ముఖం కఠినతను తొలగిస్తుంది. మృదువుగా చేస్తుంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this