Horoscope 26-5-2021: నేటి రాశి ఫలాలు.. ఇవాళ...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Horoscope 26-5-2021: నేటి రాశి ఫలాలు.. ఇవాళ ఈ రాశుల వారికి చాలా బాగుంది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Horoscope today: నేటి రాశి ఫలాలు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం

Horoscope 26-5-2021: రాశుల వారీగా నేడు ఎవరికి ఎలా బాగుంది. ఏ రాశుల వారికి బాగుంది? ఏ రాశుల వారికి బాగాలేదు. జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు? పూర్తి వివరాలు.
మేష రాశి (Aries) ఆదాయం నిలకడగా ఉంటుంది. పొదుపు ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూంగా ఉంటుంది. ఆరోగ్యం పరవా లేదు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. స్నేహితురాలితో ఉత్సహంగా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం దొరికే అవకాశముంది.
వృషభ రాశి (Taurus) సొంత ఊళ్లోనే ఉద్యోగానికి ఆఫర్‌ వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. తిప్పట ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల వారికి శ్రమ మిగులుతుంది. రియల్ ఎస్టేట్, స్వయం ఉపాధి వారికి బాగుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలపడతాయి.
మిథున రాశి (Gemini) ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. ఆదాయానికి ఢోకా లేదు. సంపాదన పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. ఆరోగ్యం మాత్రం చూసుకోవాలి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయండి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి ఉద్యోగం దొరికే అవకాశముంది.
కర్కాటక రాశి (Cancer) ఉద్యోగంలో మంచి ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. శుభవార్త వింటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు.
సింహ రాశి (Leo) ఆరోగ్యపరంగా, ఆర్థికంగా సమయం బాగానే ఉంది. రుణాల నుంచి బయటపడతారు. పెళ్లికి సంబంధించి శుభవార్త వింటారు. తపెట్టిన పనులు పూర్తవుత యి. సంత నం నుంచి శుభవార్త వింటారు. విదేశాల నుంచి ఆఫర్‌వస్తుంది. ప్రేమ వ్యవహారా ల్లో ముందడుగు వేస్తారు. ఎవరికీ హామీ ఉండొద్దు.
కన్య రాశి (Virgo) అన్ని విధాలా అనుకూమైన సమయం. వ్యాపారులకు, లాయర్లకు, కోర్టు ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మంచి చోట పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
తుల రాశి (Libra) ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. వ్యాపారులు లాభాలను ఆర్జిస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం వస్తుంది. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి
వృశ్చిక రాశి (Scorpio) పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పరవా లేదు. మంచి ఉద్యోగంలో చేరతారు. పెళ్లి ప్రయత్నం ఫలిస్తుంది. తగాదాల్లో తలదూర్చవద్దు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారులు శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యహారాలు ఫలిస్తాయి.
ధనస్సు రాశి (Sagittarius) అనుకోకుండా ఆదాయం కలిసి వస్తుంది. నచ్చినవారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితుకు ఆర్థిక సహాయం చేస్తారు. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులకు మంచి మేలు జరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయండి.
మకర రాశి (Capricorn) సొంత ఊర్లో మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. కొన్ని పనులు ఆలస్యం అవుతాయి. రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం అనుకూలంగా ఉంది. బంధువుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులు కొద్ది లాభాలతో తృ ప్తి పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.
కుంభ రాశి (Aquarius) ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం పరవాలేదు. మితిమీరిన ఖర్చులకు కళ్లెం వేయాలి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఇరుగు పొరుగుతో కొద్దిగా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వృత్తి, వ్యాపారుల వారికి యథాస్థితి కొనసాగుతుంది.
మీన రాశి (Pisces) వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి నిపుణుల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పు, చేర్పులు ఉండవచ్చు. ప్రేమ వ్యవహారం పరవాలేదు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this