Gold Price Today: బంగారం కొనే వారికి...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Gold Price Today: బంగారం కొనే వారికి శుభవార్త.. అక్షయ తృతీయ ముంగిట తగ్గుతున్న బంగారం ధరలు..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Gold Price Today: పసిడి వెలవెలబోతోంది. తాజాగా నేలచూపులు చూస్తోంది. పసిడి రేటు ఈరోజు కూడా పడిపోయింది. బంగారం ధర దిగొచ్చింది. కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర.. ఈ రోజు తగ్గుముఖం పట్టింది. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పాలి. బంగారం ధర బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. ఇక అక్షయ తృతీయ ముంగిట బంగారం ధర దిగిరావడం చాలా మందికి కలిసొచ్చే అంశమని చెప్పుకోవచ్చు. అక్షయ తృతీయ ఈ నెల 14న వస్తుంది. అంటే శుక్రవారం అక్షయ తృతీయ. చాలా మంది అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే మంచిదని విశ్వాసిస్తారు. అందుకే పసిడిని కొంతైనా కొనుగోలు చేస్తుంటారు. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల ఇలా ఉన్నాయి.

తాజా ధరలు ఇలా..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,720 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,720 వద్ద ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,560 ఉంది. అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,560 ఉంది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉంది. అలాగే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 వద్ద ఉంది.

అయితే బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. అయితే బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. బంగారం కొనుగోలు చేసే వారు ధరలను తెలుసుకొని వెళ్లడం మంచిది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this