Gold Price Today: తగ్గిన బంగారం ధర.....

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Gold Price Today: తగ్గిన బంగారం ధర.. రికార్డు స్థాయి నుంచి రూ. 9 వేలు వరకు పతనమైన పసిడి రేటు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Gold Rate Today: గత రెండు రోజులుగా బంగారం ధర పరుగులు పెట్టింది. అయితే బంగారం ధర పెరిగినా కూడా రికార్డు స్థాయి నుంచి చూస్తే.. పసిడి రేటు ఇంకా దిగువ స్థాయిలోనే కదలాడుతోంది.  భారీగానే పడిపోయిందని చెప్పవచ్చు.  తాజాగా గురువారం బంగారం ధర తగ్గింది. దేశీయంగా పరిశీలిస్తే.. 10 గ్రాముల బంగారంపై రూ.300 వరకు తగ్గుముఖం పట్టింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,280 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,280 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630 వద్ద ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,280 ఉండగా, 24 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.45,280 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,160 ఉంది. అలాగే కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,230 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890 ఉంది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890 వద్ద కొనసాగుతోంది. అలాగే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890 వద్ద కొనసాగుతోంది.

కాగా, బంగారం ధర గత ఏడాది రికార్డు స్థాయిలో నమోదైంది. 2020 ఆగస్టు నెలలో బంగారం ధర ఏకంగా రూ.56,200 స్థాయికి పరుగులు పెట్టింది. ఇది ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి. ఇక్కడ చూస్తే ఇప్పటి వరకు బంగారం 25 శాతం పడిపోయింది. ప్రస్తుతం ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధర రూ.47 వేల సమీపంలో కదలాడుతోంది. అంటే ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి నుంచి చూస్తే బంగారం ధర ఇంకా రూ.9 వేలకు పైగానే పడిపోయిందని చెప్పుకోవచ్చు. బంగారం కొనాలని భావించే వారికి ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this