Fake Vaccination Link: వ్యాక్సినేష‌న్ పేరుతో న‌కిలీ...

AP Inter Results 2026 Today Live: Direct Links for 1st & 2nd Year Results, WhatsApp Mana Mitra Process, SMS Method

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

Fake Vaccination Link: వ్యాక్సినేష‌న్ పేరుతో న‌కిలీ లింక్‌లు.. క్లిక్ చేశారో అంతే సంగ‌తులు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Fake Vaccination Link: దేశాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారికి అడ్డుక‌ట్ట వేయాలంటే మ‌న ద‌గ్గ‌ర ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సినేష‌న్‌. వ్యాక్సిన్ వేసుకున్న వారికి కరోనా సోకినా దాని ప్ర‌భావం అంత‌గా, ఉండ‌ద‌ని ప్రాణాపాయ స్థితి నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చ‌ని ఇప్ప‌టికే ప‌లు అధ్య‌య‌నాల్లో తేలింది. దీంతో ఇప్పుడిప్పుడే దేశంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌పై అవ‌గాహ‌న పెరుగుతోంది. ఇప్ప‌టికే 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ ఇస్తుండ‌గా.. 18 ఏళ్లు పైబ‌డిన వారికి మే 1 నుంచి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది.

అయితే వ్యాక్సిన్ తీసుకోవాల‌నుకునే వారు క‌చ్చితంగా ఆన్‌లైన్ పోర్ట‌ల్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకుంటేనే వ్యాక్సిన్ తీసుకునే వెసులుబాటు ఉన్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. దీంతో వ్యాక్సిన్ కోసం కోవిన్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకుంటున్నారు. అయితే ఎలాంటి ప‌రిస్థితుల‌ను అయినా స‌రే త‌మ‌కు అనుగుణంగా మార్చుకునే సైబ‌ర్ నేర‌గాళ్లు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను కూడా త‌మ అక్ర‌మాల‌కు వార‌ధిగా ఉప‌యోగించుకుంటున్నారు. తాజాగా ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ఓ న‌కిలీ వ్యాక్సినేష‌న్ లింక్ వైర‌ల్ అవుతోంది. ఎస్ఎమ్ఎస్ రూపంలో వ‌స్తోన్న ఈ ఫేక్ సందేశంలో ఓ లింక్ ఉంది. ఒక‌వేళ పొర‌పాటున ఆ లింక్‌ను క్లిక్ చేశారో వెంట‌నే.. మీ ఫోన్‌లో ఓ యాప్ డౌన్‌లోడ్ అవుతుంది. ఈ యాప్‌తో మీ స్మార్ట్ ఫోన్‌లోని డేటా మొత్తం సైబ‌ర్ నేర‌గాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. కాబ‌ట్టి ఎట్టి ప‌రిస్థితుల్లో ఇలాంటి లింక్‌ల‌ను క్లిక్ చేయ‌కూడ‌ద‌ని.. వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్ కోసం కోవిన్ యాప్ లేదా వెబ్‌సైట్‌ను ఉప‌యోగించాల‌ని సూచిస్తున్నారు.

న‌కిలీ వ్యాక్సినేష‌న్ లింక్ ఇదే..

SMS worm impersonates Covid-19 vaccine free registration

Android SMS worm tries to spread via text messages as fake free registration for Covid-19 vaccine – targets India 🇮🇳
It can spread itself via SMS to victim contacts with link to download this malware. https://t.co/EXAAGARqOP pic.twitter.com/HX957bPVu5

— Lukas Stefanko (@LukasStefanko) April 29, 2021

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this