Daily Astrology: మే 3, సోమవారం దిన...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Daily Astrology: మే 3, సోమవారం దిన ఫలాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Horoscope 3-5-2021: ఇవాళ ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? గ్రహ బలాలు ఏం సూచిస్తున్నాయి? ఎవరికి మంచి ఫలాలు దక్కనున్నాయి? అన్ని విషయాలూ వివరంగా తెలుసుకుందాం.

Horoscope 3-5-2021: రాశి ఫలాలు వాస్తవాల్ని చెబుతాయా అనేది ఎప్పుడూ ఉండే ప్రశ్నే. కీడెంచి మేలు ఎంచమంటారు పెద్దలు. రాశి ఫలాల్లో మంచి శుభవార్తలు ఉంటే… ఆనందమే. అదే అనుకోని అనర్థాలు, ప్రమాద సంకేతాలు ఉంటే జాగ్రత్త పడొచ్చు. వివాదాలు, గొడవలు, ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తతలు, ఇంట్లో మనస్పర్థలు, వ్యాపారాల్లో నష్టాలు ఇలాంటి ఎన్నో అంశాల్లో మనల్ని అలర్ట్ చేస్తాయి రాశిఫలాలు. గ్రహాలు, తిథి, నక్షత్రం, వర్జ్యం ఇలా ఎన్నో అంశాల్ని లెక్కలోకి తీసుకొని వీటిని రూపొందిస్తున్నారు జ్యోతిష పండితులు. అందువల్ల ఇవి వాస్తవాలు చెబుతాయా లేదా అనే దాని కంటే… అప్రమత్తం అయ్యేందుకు ఇవి సరైన మార్గం సూచిస్తాయి. మరి ఇవాళ్టి రాశిఫలాలు చూద్దాం.
మేష రాశి (Aries) ధనలాభం ఉంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. సుఖసంతోషాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధి కనిపిస్తోంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. వితరణ కార్యక్రమంలో పాల్గొంటారు. శుభవార్త వింటారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం పరవాలేదు.
వృషభ రాశి (Taurus) ముఖ్యమైన పనుల్లో జాగ్రత్తలు అవసరం. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. కొందరు బంధువుల నుంచి చికాకులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు తీసుకోండి. ఆరోగ్యం జాగ్రత్త. తగినంత విశ్రాంతి అవసరం. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.
మిథున రాశి (Gemini) అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులుంటాయి. ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో మరింత శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఇంట్లో శాంతికి, సుఖానికీ లోటుండదు. శ్రమ మీద కొన్ని పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.
కర్కాటక రాశి (Cancer) ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు అందుకుంటారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. శుభవార్త వింటారు. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.
సింహ రాశి (Leo) ఉద్యోగంలో సుస్థిరత ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి ఉంది. పట్టుదలతో కొన్ని పెండింగ్‌ పనులు పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. స్నేహితులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కన్య రాశి (Virgo) ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఎంతో ప్రయత్నం మీద పనులు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి.
తుల రాశి (Libra) ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంది. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే కలిసి వస్తాయి. కుటుంబ సమస్య ఒకటి ఇబ్బంది పెడుతుంది. ఇంటా బయటా ఒత్తిళ్లు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆదాయం తగ్గి ఖర్చు పెరిగే సూచనలు ఉన్నాయి. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశముంది.
వృశ్చిక రాశి (Scorpio) ఉద్యోగ జీవితం బాగానే ఉంటుంది కానీ, కుటుంబంలో ప్రశాంతత తగ్గుతుంది. వ్యాపారపరంగా అప్రమత్తంగా ఉంటే మంచిది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. తలచిన పనులు నెరవేరుతాయి. ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.
ధనస్సు రాశి (Sagittarius) ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్నేహితుల వల్ల నష్టం జరగవచ్చు.
మకర రాశి (Capricorn) వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం ఆశాజనకంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుని పనులు మొదలుపెట్టండి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. కొన్ని బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. శుభవార్త వింటారు.
కుంభ రాశి (Aquarius) ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. శక్తికి మించి శ్రమ పడతారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ఇతరులకు సహాయం చేస్తారు. ఆదాయం ఒడిదొడుకులకు లోనవుతుంది. ఎవరితోనూ వాదనకు దిగవద్దు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మిత్రులతో విభేదాలు తలెత్తుతాయి.
మీన రాశి (Pisces) ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. సంకల్ప బలంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఇతర సంస్థల నుంచి కొత్త ఆఫర్లు వస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this