Monday, September 8, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Daily Astrology: మే 11, మంగళవారం దినఫలాలు...

One-year B.Ed, : ఇక 2-సంవత్సరాల B.Ed కాదు.. ప్రభుత్వం 1-సంవత్సరం ఫాస్ట్-ట్రాక్ కోర్స్ ప్రకటించింది!

One-year B.Ed భారతదేశంలో టీచర్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో పెద్ద మలుపు తిరిగింది....

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ 2025: జిల్లా వారీగా, పోస్ట్ వారీగా రిజెక్షన్ల వివరణ (DSC 2025 Rejections Analysis in Telugu)

ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ (DSC) 2025 లో విద్యాఉద్యోగాలకు దరఖాస్తు చేసిన...

Daily Astrology: మే 11, మంగళవారం దినఫలాలు – చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మేషం : స్థిరాస్తిని అమ్మటానికి చేయు యత్నాలు వాయిదాపడతాయి. మీ యత్నాలకు ఆటంకాలు తొలగిపోయి పనులు సానుకూలమవుతాయి. మీ శ్రీమతితో అనునయంగా మెలగాలి. వృత్తుల వారికి ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఉద్యోగస్తులకు దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.

వృషభం : దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కదురదు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. క్రీడల పట్ల నూతన ఉత్సాహం కానవస్తుంది. చేతి వృత్తుల వారికి కలిసిరాగలదు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

మిథునం : బంధు మిత్రుల కలయిక సంతోషపరుస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకులు కలిగిస్తుంది. సభలు, సమావేశాలలో హుందాగా వ్యహరించి అందరినీ ఆకట్టుకుంటారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. ఖర్చులు పెద్దగా లేకున్నా ధనవ్యయం, ధనసహాయం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం : ఉమ్మడి వెంచర్లు, సంస్థల స్థాపనలో పునరాలోచన అవసరం. అపరిచిత వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. జాగ్రత్త వహించండి. ప్రముఖుల కలయిక సాధ్యంకాదు. ఉపాధ్యాయులకు మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.

సింహం : గృహ నిర్మాణాలు, మరమ్మతులు ఆశించినంత చురుకుగా సాగవు. స్త్రీలు, విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. ధనవ్యయం విపరీతంగా ఉన్నా ప్రయోజనం, సార్థకత ఉంటాయి. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి.

కన్య : కిరాణా, ఫ్యాన్సీ, మందులు, ఆల్కహాలు, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి భాగస్వామిక చర్చలు ఒక పట్టాన పూర్తికావు. బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. విదేశాల్లోని అభిమానులు క్షేమ సమాచారం ఆందోళన కలిగిస్తుంది.

తుల : ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఏజెంట్లకు రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. స్త్రీల ప్రతిభాపాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. ఫ్లీడర్లకు తమ క్లయింట్లతీరు ఇబ్బందులకు గురిచేస్తుంది.

వృశ్చికం : ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. కాంట్రాక్టర్లకు రావలిసిన ధనం అందడంతో ఉపశమనం పొందుతారు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం.

ధనస్సు : శారీరకశ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రముఖుల కలయిక, బ్యాంకు వ్యవహారాలు ఒక పట్టాన పూర్తికావు. నిరుద్యోగులు తాత్కాలిక ఉద్యోగాల్లో నిలదొక్కుకుంటారు. విలువైన వస్తు కొనగోళ్ళలో ఏకాగ్రత అవసరం.

మకరం : మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. అప్రమత్తంగా అవసరం. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. ప్రైవేటు సంస్థలలోని వారికి సామాన్యం. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. నూతన దంపతుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.

కుంభం : పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఖర్చులు అధికమైనా సంతృప్తి. ప్రయోజనం పొందుతారు. కొత్త వ్యక్తుల నుంచి ఊహించని చికాకులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి.

మీనం : కొబ్బరి, పండ్లు, పూల, రసాయన, సుగంధ ద్రవ్యాలు, ఆల్కహాలు వ్యాపారులకు పురోభివృద్ధి. దూర ప్రయాణాలు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. గత కొంతకాలంగా అనుభవిస్తున్న చికాకులు తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది. నిరుద్యోగులకు మంచి మంచి సదావకాశాలు లభిస్తాయి.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this