Covid Vaccine: కరోనా వ్యాక్సినేషన్ పై ఏపీ...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Covid Vaccine: కరోనా వ్యాక్సినేషన్ పై ఏపీ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్.. తర్వాతి దశలో వారికే ప్రాధాన్యం..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) కరోనా వ్యాక్సిన్ (Corona Vaccine) కు కొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. అలాగే వైద్య సౌకర్యాలను మెరుగు పరచనుంది.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. కేంద్రం నుంచి వచ్చిన వ్యాక్సిన్ల సంఖ్య ఆధారంగా ప్రతి రోజూ వేలాది మందికి వ్యాక్సిన్ ఇస్తోంది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం కొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ నెల 15వ తేదీలోగా 9 లక్షల వ్యాక్సిన్ డోసులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రానున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని ఆయన చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే వ్యాక్సిన్లు 45 ఏళ్లు పైబడిన వారికి రెండో విడత డోసులకు మాత్రమే వేస్తామన్నారు. వారికి వేయగా మిగిలిన డోసులను ప్రజా సంబంధమైన కార్యకలాపాలతో ప్రత్యక్ష సంబంధం కలిగి… 45 ఏళ్లు నిండిన ఆర్టీసీ, బ్యాంకు ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు మొదటి డోసుగా వేస్తామన్నారు.

రెమిడెసివిర్ కు కొరత లేదు

రాష్ట్రంలో రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రుల్లో 21,898 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మంగళవారం రాత్రికి మరో 12 వేల డోసులు రాబోతున్నాయని, వాటిని కూడా కూడా రేపు వివిధ ప్రభుత్వాసుపత్రులకు అందజేస్తామని వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 14,030 రెమిడెసివిర్ ఇంజక్షన్లను ప్రైవేటు ఆసుపత్రులకు అందజేశామన్నారు. ప్ర్రైవేటు ఆసుపత్రుల్లో కూడా రెమిడిసివిర్ ఇంజక్షన్ల కొరత లేదన్నారు. కాల్ సెంటర్ కు కూడా కొరత ఉందంటూ ఫోన్లు రాలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 446 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను సప్లయ్ చేశామన్నారు. లిక్విడ్ ఆక్సిజన్ ట్రాన్స్ పోర్టు కోసం మరో 3 ట్యాంకర్లు అందుబాటులో రానున్నాయన్నారు.

మెరుగైన సౌకర్యాలు

ఒక PHC ఉన్న మండలంలో మరో PHC, ఎటువంటి వైద్య సేవలు లేని మండలాల్లో రెండు పీహెచ్సీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు ఇలా రాష్ట్రంలో కొత్తగా 176 కొత్త ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం రూ.346 కోట్లు వ్యయం కానుందన్నారు. నూతనంగా నిర్మించబోయే హెల్త్ సెంటర్లలో వైద్యులు, నర్సులు సహా పలు 1400 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోస్టుల భర్తీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.165 కోట్ల భారం పడనుందన్నారు. రాష్ట్రంలో 166 మండలాల్లో ఒక పీహెచ్సీ మాత్రమే ఉందన్నారు. ఏజెన్సీ మండలాల్లో కూడా సీహెచ్సీల నిర్మాణం చేపడతామన్నారు.

అందుబాటులో బెడ్లు

రాష్ట్ర వ్యాప్తంగా 6,319 ఐసీయు బెడ్లు ఉండగా, 5,743 వినియోగంలో ఉన్నాయన్నారు. కర్నూల్ లో 533 ఐసీయూ బెడ్లకు 300 బెడ్లపై కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్నారన్నారని, మరో 233 ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ప్రకాశం జిల్లాలో 68 ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ బెడ్లు 21,858 ఉండగా, 20,108 బెడ్లు నిండిపోయాయన్నారు 1,750 మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. అత్యధికంగా చిత్తూరులో 557 బెడ్ లు ఖాళీగా ఉండగా, విజయనగరం జిల్లాలో 200 అందుబాటులో ఉన్నాయన్నారు. మిగిలిన జిల్లాలో తక్కువ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయన్నారు.

104కు 16 వేలకు పైగా ఫోన్ కాల్స్…

104 కాల్ సెంటర్ కు గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 16,856 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. వాటిలో వివిధ రకాల సమాచారాల నిమిత్తం 6,592 కాల్స్, టెస్టులకు 3,726, అడ్మిషన్లకు 2, 976, కరోనా టెస్టు ఫలితం కోసం 2,224 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు.

కర్ఫ్యూకు సహకరించండి

కర్ఫ్యూలో భాగంగా బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ అన్ని సంస్థలు పనిచేస్తాయని ఆయన వెల్లడించారు. ఆ సమయంలో గుంపు గుంపులుగా ఉండకుండా 144 సెక్షన్ కు లోబడి అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉందన్నారు. మధ్యాహ్నం 12 గంటల తరవాత కర్ఫ్యూ అమల్లోకి వస్తుందన్నారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి మార్గదర్శకాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లుకు ఎస్పీలకు అందజేస్తామన్నారు. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి కర్ఫ్యూ తప్పనిసరి అని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this