Thursday, September 4, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Covid-19: కరోనా తర్వాత కోలుకునేందుకు.. ఈ ఆహార...

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ 2025: జిల్లా వారీగా, పోస్ట్ వారీగా రిజెక్షన్ల వివరణ (DSC 2025 Rejections Analysis in Telugu)

ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ (DSC) 2025 లో విద్యాఉద్యోగాలకు దరఖాస్తు చేసిన...

ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు 2026: ప్రీ-ఎలెక్షన్ షెడ్యూల్ ప్రకటన (AP Gram Panchayat Elections 2026 Pre-Election Schedule)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (State Election Commission) 2026లో జరగనున్న...

AP TET Old Results: 2011 నుండి 2016 వరకు APTET Results & Marks Cardను డౌన్లోడ్ చేసుకోండి

AP TET Old Results కోసం tension పడుతున్నారా? 2011, 2012,...

Covid-19: కరోనా తర్వాత కోలుకునేందుకు.. ఈ ఆహార నియమాన్ని పాటించండి.. ప్రభుత్వం సూచనలు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Covid-19 – 5 Step Sample Meal Plan: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దేశంలో నిత్యం నాలుగు లక్షలకు పైగా కేసులు, నాలుగు వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతటా ఆందోళన నెలకొంది. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా.. కోవిడ్ కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూను విధించి చర్యలు తీసుంటున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ బారిన పడకుండా ఉండేందుకు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా బలంగా ఉండేందుకు పలు ఆహారాల పదార్థాలను తినాలని సూచిస్తున్నారు.

అయితే.. కోవిడ్ బారిన పడి కోలుకునేటప్పుడు కూడా కొన్ని ఆహార నియమాలను పాటిస్తే మేలని ప్రభుత్వం శనివారం పలు సూచనలు చేసింది. కోవిడ్ సోకిన అనంతరం అలసట, నీరసం నుంచి కోలుకునేందుకు, రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు కొన్ని ఆహార పదార్థాలను తినాలంటూ ప్రభుత్వం పలు సూచనలు చేసింది. దీని కోసం ఐదు దశల ఆహార నమూనాలను అవలంభిస్తే మేలని.. రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ప్రభుత్వం ట్విట్ చేసింది.

ఈ ఐదు దశల ఆహార పద్దతులు..

1. ఉదయాన్నే నానబెట్టిన బాదం, ఎండుద్రాక్ష తినాలి. బాదంలో మంచి ప్రోటీన్‌ను ఉంటుంది. దీంతోపాటు ఎండుద్రాక్షతో శరీరానికి ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది.

2. అల్పాహారం కోసం రాగి దోస లేదా గోధుమ రవ్వ తింటే చాలా మంచిది. ఎందుకంటే ఈ రెండు కూడా మంచి బలాన్ని చేకూరుస్తాయి.

3. మధ్యాహ్నం భోజనం అనంతరం బెల్లం, నెయ్యి తినవచ్చు. దీంతోపాటు ఈ రెండు పదార్థాలను రోటీలో కూడా కలిపి తినవచ్చు. దీంతో శరీరానికి మంచి పోషకాహారం లభిస్తుంది.

4. రాత్రి భోజనం సమయంలో అన్ని పోషకాలు కలిగి ఉన్న సాధారణ ఖిచిడి తీసుకుంటే మంచిది. ఈ ఖిచిడీతో ఆహారం త్వరగా జీర్ణం కావడంతోపాటు.. మంచి నిద్రకు సహాయపడుతుంది.

5. వేసవి, కరోనా కరోనా కాలంలో హైడ్రేటెడ్ గా ఉండటం ముఖ్యం. కావున తరచూ నీటితో పాటు, నిమ్మరసం, మజ్జిగ లాంటి వాటిని తాగుతుంటే మంచిది.

ట్వీట్..

Wondering what to eat while recovering from
Covid?
Check out this 5-Step Sample Meal Plan that will boost your #immunity and help you recover from post #Covid fatigue.
Thank you @RujutaDiwekar#IndiaFightsCorona#BoostImmunity@MoHFW_INDIA @MIB_India pic.twitter.com/GXiqlGE6aH

— MyGovIndia (@mygovindia) May 8, 2021

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this