CBSE Results: పదో తరగతి మార్కుల విధానంపై...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

CBSE Results: పదో తరగతి మార్కుల విధానంపై సీబీఎస్ఈ కీలక ప్రకటన.. ఫలితాలు ఎప్పుడంటే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

CBSE Results: విద్యార్థులకు మార్కులను కేటాయించే విషయంలో పాఠశాలలు రిజల్ట్‌ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. అందులో స్కూల్‌ ప్రిన్సిపాల్‌, స్కూల్‌కు చెందిన 5 మంది టీచర్లు, ఇతర స్కూల్‌కు చెందిన ఇద్దరు టీచర్లు సభ్యులుగా ఉండాల్సి ఉంటుంది.

కరోనా తీవ్రత కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్ఈ.. విద్యార్థులకు మార్కులను ప్రకటించే విధానంపై కీలక ప్రకటన చేసింది.

విద్యార్థులకు అకాడమిక్‌ ఇయర్‌లో నిర్వహించిన ఎగ్జామ్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్‌ పరీక్షల మార్కులను వెల్లడించనున్నట్టు పేర్కొంది.

మొత్తం 100 మార్కుల్లో 80 మార్కులను అకాడమిక్‌ ఇయర్‌లో నిర్వహించిన పరీక్షల మార్కుల ఆధారంగా కేటాయించనున్నారు. మిగలిన 20 మార్కులను ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా ఇస్తారు.

విద్యార్థులకు మార్కులను కేటాయించే విషయంలో పాఠశాలలు రిజల్ట్‌ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. అందులో స్కూల్‌ ప్రిన్సిపాల్‌, స్కూల్‌కు చెందిన 5 మంది టీచర్లు, ఇతర స్కూల్‌కు చెందిన ఇద్దరు టీచర్లు సభ్యులుగా ఉండాల్సి ఉంటుంది.

వారు విద్యార్థుల మార్కులను అసెస్‌ చేసి వారికి మార్కులను ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి స్కూల్‌ మార్కులను ఇచ్చేందుకు ఈ విధానాన్నే అనుసరించాలని స్పష్టం చేసింది.

ఇక స్కూల్‌లో నిర్వహించిన టెస్టులకు హాజరు కాని విద్యార్థులకు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ విధానంలో పరీక్షలను నిర్వహించి స్కూల్స్‌ మార్కులను కేటాయించాలి.

స్కూల్‌లో నిర్వహించే ఇతర యాక్టివిటీలలో వచ్చిన మార్కుల ఆధారంగా కూడా విద్యార్థులకు మార్కులను ఇవ్వవచ్చు.

పరీక్షల్లో కనీస మార్కులు కూడా రాని వారికి సీబీఎస్‌ఈ బోర్డు గ్రేస్‌ మార్క్‌లను ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇక ఈ రకంగా ఖరారు చేసిన ఫలితాలను జూన్‌ 20న ప్రకటించనున్నట్టు సీబీఎస్ఈ ప్రకటించింది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this