UncategorizedCBSE 12th board Exams 2021: జూలైలో...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

CBSE 12th board Exams 2021: జూలైలో సీబీఎస్ఈ 12 వ తరగతి పరీక్షలు? త్వరలో అధికారిక ప్రకటన.. వివరాలివే

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

CBSE 12th board Exams 2021: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను జూలైలో నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. పరీక్షల తేదీలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ జూన్ 1న కీలక ప్రకటన చేయనున్నారు.

కరోనా నేపథ్యంలో టెన్త్ ఎగ్జామ్స్ ను రద్దు చేసిన సీబీఎస్ఈ, 12వ తరగతి పరీక్షలను మాత్రం వాయిదా వేసింది. అయితే ఈ పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విపరీతమైన డిమాండ్ వచ్చింది. సోషల్ మీడియా ద్వారా విద్యార్థులు తమ అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు విద్యార్థులు. ఈ కరోనా పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం సరికాదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే నిన్న సీబీఎస్ఈ పరీక్షలతో పాటు నీట్, జేఈఈ తదితర పరిక్షల నిర్వహణ అంశంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతీ ఇరానీతో పాటు ఆయా రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని వర్చువల్ విధానంలో నిర్వహించారు. పరీక్షలు నిర్వహించాలా? వద్దా? అన్న అంశంపై సమావేశంలో చర్చించారు. అయితే సీబీఎస్ఈ బోర్డుతో పాటు కేంద్ర ప్రభుత్వం సైతం పరీక్షలను నిర్వహించడానికే మొగ్గు చూపినట్లు సమాచారం.  కరోనా నిబంధనలు పాటిస్తూ జూలైలో ఆయా పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ఈ పరీక్షలతో పాటు జేఈఈ, నీట్ ఎగ్జామ్స్ ను కూడా నిర్వహించాలని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని జూలైలోనే ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు సమాచారం. విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ పరిక్షల ఫార్మాట్, తేదీల గురించి మరిన్ని వివరాలను జూన్ 1న ప్రకటించనున్నారు. సీబీఎస్ఈ సూచించిన ఆప్షన్లపై ఆయా రాష్ట్రాలు వారంలో తమ అభిప్రాయాలు అందించాలని కేంద్రం కోరింది. అయితే నిన్ననే సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలపై కీలక ప్రకటన వస్తుందని అంతా భావించారు. అయితే ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు నిరాశకు గురయ్యారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణలోనూ కరోనా కేసులు తగ్గితే వచ్చే నెలాఖరులో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను నిర్వహించాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు నిన్న కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వెల్లడించినట్లు సమాచారం. పరీక్షలను నిర్వహించడం సాధ్యం కాకపోతే ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా సెకండియర్ ఫలితాలను ప్రకటించే ప్రతిపాదిన ఉందని ఆయన చెప్పారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this