Thursday, February 19, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Black Fungus: అంటువ్యాధిగా బ్లాక్ ఫంగస్‌....ప్రకటించిన మరో...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Black Fungus: అంటువ్యాధిగా బ్లాక్ ఫంగస్‌….ప్రకటించిన మరో రాష్ట్ర ప్రభుత్వం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Black Fungus in Rajasthan: దేశంలో ఓ వైపు కరోనావైరస్ విజృంభిస్తోంది. ఈ తరుణంలో మరోవైపు బ్లాక్ ఫంగస్ కూడా భయాందోళనకు గురించేస్తోంది. 

రెండు మహమ్మారులు కూడా ప్రజలపై ముప్పేట దాడి చేస్తుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. అయితే.. ఎక్కువగా బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్‌మైకోసిస్ ) కోవిడ్ నుంచి కోలుకున్న వారిని చుట్టుముడుతోంది. ఈ నేపథ్యంలో మ్యూకోర్‌మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) ను రాజస్థాన్ ప్రభుత్వం అంటువ్యాధిగా ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయి. అయితే వీరందరికీ చికిత్స అందించేందుకు ప్రభుత్వం జైపూర్‌లోని సవాయ్‌మన్ సింగ్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును కేటాయించింది. ఈ మేరకు రాజస్థాన్ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అఖిల్ అరోరా బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా పేర్కొంటూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మ్యూకోర్‌మైకోసిస్‌ను అంటువ్యాధిగా గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. రాజస్థాన్ అంటువ్యాధుల నివారణ చట్టం 2020 కింద రాష్ట్రంలో దీనిని కూడా చేర్చినట్లు వెల్లడించారు. బ్లాక్‌ ఫంగస్, కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌లకు నాణ్యమైన, సమగ్రమైన చికిత్సను అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు అరోరా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా మధుమేహ రోగులు బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశం అధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు పలు సూచనలు కూడా చేసింది. అటు కరోనా.. ఇటు బ్లాక్ ఫంగస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this