Black Fungus: కరోనా మహమ్మారి ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేసింది. కొత్త కొత్త జబ్బులను వెలుగులోకి తీసుకొస్తోంది. ఒకవైపు కరోనాతో అవస్థలు పడుతుంటే దానికి తోడు ఇప్పుడు బ్లాక్ ఫంగస్ ఒకటి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. కరోనా వైరస్ శరీరం నుంచి ఊపిరి తిత్తులకు చేరి తీవ్రమైన ఇబ్బందులు పెడుతుంది. ఊపిరి తీసుకోడం కూడా కష్టమైపోతుంది. ఇలాంటి సమయంలో ఆక్సిజన్ అందించి రోగిని కాపాడే ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఇదిలా ఉంటె, కరోనా సోకిన వ్యక్తికి కరోనా కంటే ముందు ఇతర జబ్బులు ఉన్నా, కరోనా ట్రీట్మెంట్ సమయంలో డయాబెటీస్ రోగులకు అధికంగా కరోనా మెడిసిన్స్ వినియోగించినా దాని వలన బ్లాక్ ఫంగస్ సోకే అవకాశం ఉంటుంది. బ్లాక్ ఫంగస్ సోకిన వ్యక్తికీ ముక్కు చుట్టూ తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది. కళ్ళు ఎర్రబడతాయి. జ్వరం తలనొప్పి, దగ్గు, రక్తపు వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. కరోనా చికిత్స సమయంలో డయాబెటిస్, ఇతర వ్యాధులు, శస్త్రచికిత్సలు చేయించుకొని ఉంటె వాటి గురించి ఆరోగ్యానికి సంబంధించి పూర్తి విషయాలను వైద్యులకు తెలియజేయాలి. దానికి అనుగుణంగా కరోనా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అప్పుడే బ్లాక్ ఫంగస్ నుంచి బయటపడొచ్చని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.
Black Fungus: బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి? గుర్తించడం ఎలా?
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.
