Bank Alert: ఆ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.....

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Bank Alert: ఆ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. ఇక డెబిట్ కార్డ్ అక్కర్లేదు.. మొబైల్‏తోనే డబ్బులు విత్ డ్రా..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Bank Alert: మనం సాధారణంగా డబ్బులు మొత్తం బ్యాంకులలో దాచుకుంటుంటాం. అవసరమైనప్పుడు మాత్రమే కొన్ని కొన్ని డ్రా చేస్తుంటాం. 

ఇక కొన్ని సందర్బాల్లో డబ్బులు డ్రా చేయడానికి ఏటీఎం కోసం పరుగులు పెడుతుంటాం. అయితే ఇందుకోసం కచ్చితంగా డెబిట్ కార్డు కావాల్సిందే. డెబిట్ కార్డ్ ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడానికి వీలుంటుంది. ఒకవేళ డెబిట్ కార్డు లేకపోతే.. ఇక డబ్బులు డ్రా చేయడానికి బ్యాంకులకు పరుగులు పెట్టాల్సిందే. కానీ ప్రస్తుత పరిస్థితులలో ప్రతి సారి బ్యాంకుకు వెళ్ళడం కొంత రిస్క్ అనే చెప్పుకోవాలి. అయితే ఈ కరోనా కష్టాల్లో తమ కస్టమర్లకు నగదు విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా.. కొన్ని బ్యాంకులు ఏటీఎం కార్డు లేకుండానే డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నాయి.

ఐసీఐసీఐ బ్యాంక్ కూడా తన కస్టమర్లకు ఇలాంటి తరహా సేవలను అందిస్తోంది. ఇటీవలే ఈ బ్యాంక్ తమ కస్టమర్లకు డెబిట్ కార్డు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు ఎలా డ్రా చేయాలో ఈమెయిల్ ద్వారా పూర్తి వివరాలను తెలియజేసింది. మొబైల్ ఫోన్‏లో ఐసీఐసీఐ బ్యాంక్ యాప్ iMobile App ద్వారా సులభంగానే ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు ఏటీఎంకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కార్డ్ లెస్ విత్ డ్రా అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు తీసుకోవడం వలన కార్డ్ స్కిమ్మింగ్  మోసాల నుంచి తప్పించుకోవచ్చు. అలాగే ఇందుకు ఏటీఎం పిన్ కూడా అవసరం ఉండదు. ఇక దీనికి ఎలాంటి ప్రత్యేకమైన ఛార్జీలు ఉండవు. కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే కాకుండా పలు బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు కార్డ్ లెస్ ఏటీఎం క్యాష్ విత్ డ్రా సర్వీసులు అందిస్తున్నాయి. దేశీయ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు యోనో యాప్ ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this