Andhra Pradesh: ప్రైవేటు ఆస్పత్రులకు ఏపీ ప్రభుత్వం...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Andhra Pradesh: ప్రైవేటు ఆస్పత్రులకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Andhra Pradesh: జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో తక్షణమే 50 శాతం బెడ్లను గుర్తించాలని కలెక్టర్లను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.

కరోనా కట్టడికి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా కరోనా బాధితుల కోసం మరో కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 50శాతం బెడ్లను కోవిడ్‌ పేషెంట్లకు కేటాయించాలని జగన్ సర్కార్ ఆదేశించింది. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు, ఎంప్యానెల్‌ జాబితాలోని ఆస్పత్రుల్లో బెడ్లు కేటాయించాలని స్పష్టం చేసింది. ఎంప్యానెల్‌ కానీ ఆస్పత్రులను తాత్కాలిక ఎంప్యానెల్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వాటిలోనూ 50శాతం బెడ్లు కోవిడ్‌ ఉచిత, నగదు రహిత వైద్యం పొందే పేషెంట్లకు కేటాయించాలని తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేసింది. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో తక్షణమే 50 శాతం బెడ్లను గుర్తించాలని కలెక్టర్లను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.
ఆస్పత్రుల్లో ఇంకా బెడ్లు మిగిలిఉంటే కోవిడ్‌ పేషంట్లకు ఇవ్వాలని జీవోలో పేర్కొంది. ఆరోగ్యమిత్ర, నోడల్‌ ఆఫీసర్ల పరిధిలోకి బెడ్లు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా ఏ కోవిడ్‌ పేషంట్‌ను ఆస్పత్రిలో అడ్మిషన్‌ నిరాకరించరాదని ప్రభుత్వం పేర్కొంది. కచ్చితంగా డాక్టరు అడ్మిషన్‌ సూచించిన వారిని చేర్చుకోవాలని ఆదేశించారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this