Wedding Time: పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారా..! అయితే...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Wedding Time: పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారా..! అయితే ఇది మీ కోసమే.. మే నెల మొత్తం ముహూర్తాలే..?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Wedding Days in May Month : హిందూ మతంలో ఏదైనా శుభకార్యాలు చేసే ముందు మంచి ముహూర్తం చూసుకోవడం ఆనవాయితీ. వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే జరుగుతుంది కానీ రెండు కుటుంబాలను కలుపుతుంది. అందువల్ల వివాహానికి సంబంధించి పవిత్రమైన పనులన్నీ శుభ గడియలలోనే చేస్తారు. వివాహం సందర్భంగా ఎలాంటి సమస్య తలెత్తకూడదని ఇలా చేస్తారు. అందువల్ల గ్రహాల కదలిక, వారి స్థితి గతులను అంచనా వేసి పెళ్లి తంతు పెట్టుకుంటారు.

ఈ ఏడాది వివాహం చేసుకోడానికి సిద్ధంగా ఉన్న యువతీ యువకులకు మౌఢ్యం బ్రేకులు వేసింది. దీంతో కొద్ది నెలలు వేచిచూడక తప్పలేదు. హిందూ క్యాలెండర్ ప్రకారం మే నెలలో పెళ్లిళ్లకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. చాలా మంచి ముహూర్తాలు ఉన్నాయి. వివాహ విషయాలలో గురు, బుధుడు ముఖ్యమైనవిగా భావిస్తారు. జ్యోతిష్యం ప్రకారం ఈ రెండు గ్రహాలు అనుకూలంగా లేకుంటే ఆ పెళ్లి జరగదు. మే నెలలో వివాహానికి మంచి రోజులు ఇలా ఉన్నాయి.. మే 2, 4,7, 8, 21, 22, 23, 24, 26, 29, 31 తేదీలు పెళ్లిళ్లకు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు.

వాస్తవానికి పెళ్లిళ్లకు మాఘమాసం మంచిదంటారు. ‘మఘం’ అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు శ్రేష్ఠమైన మాసంగా పరిగణిస్తారు. ఉత్తరాయణం మొదలైన తర్వాత వచ్చే మాఘమాసం పుణ్యకార్యాలకు శుభప్రదమైంది. ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి నెలలో వస్తుంది. దీంతో ఫిబ్రవరిలో ఏటా లక్షలాది జంటలు వివాహ బంధంతో ఒక్కటవుతాయి. అనేక మంది గృహప్రవేశాలకు ఇదే మంచి కాలమని భావిస్తారు. కానీ, ఈ ఏడాది శుక్రమౌఢ్యమి కారణంగా ఫిబ్రవరిలో శుభ ముహూర్తాలు లేవని పండితులు పేర్కొన్నారు. శూన్యమాసం ఫిబ్రవరి 12తో ముగుస్తుంది.. కానీ శుక్ర మౌఢ్యమి ఫిబ్రవరి 14న ప్రారంభమై 80 రోజులు ఉంటుంది.. ఈ సమయంలో వివాహాలు జరిపిస్తే చెడు ఫలితాలు ఉంటాయి.. అందుకే మే నెలలో వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this