SBI కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ ఛార్జీలను...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

SBI కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ ఛార్జీలను తిరిగిచ్చిన బ్యాంకు.. మీ ఖాతాలను చెక్ చేసుకోండి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

బ్యాంకింగ్ దిగ్గజం
ఎస్బీఐ(State Bank Of India) తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జీరో
బ్యాలెన్స్ ఖాతాల్లో నెలకు నాలుగు కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్స్
నిర్వహిస్తే వసూలు చేసిన ఛార్జీలను తిరిగి రీఫండ్ చేసినట్లు వెల్లడించింది.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ(SBI) తాజాగా కీలక ప్రకటన చేసింది. జీరో
బ్యాలెన్స్‌ ఖాతాల్లో నాలుగు కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిపితే
విధించిన ఛార్జీలను ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది.

నాలుగు లావాదేవీలు మించి చేసిన డిజిటల్‌ లావాదేవీలపై వసూలు చేసిన ఛార్జీలను
రిఫండ్‌ చేసినట్లు చెప్పింది. పరిమితికి మించిన లావాదేవీలపై ఛార్జీలు
వసూలు చేయడానికి ఆర్బీఐ 2012 ఆగస్టులో వెసులుబాటు కల్పించిందని బ్యాంకు
తెలిపింది.

ఈ నేపథ్యంలో బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంకు డిపాజిట్‌(బీఎస్‌బీడీ) ఖాతాదారులు
నెలలో నాలుగు ఉచిత లావాదేవీల తర్వాత జరిపే ట్రాన్‌సెక్షన్స్‌పై ఛార్జీలు
వసూలు చేసినట్లు బ్యాంకు వివరించింది. ఖాతాదారులకు ముందస్తుగా సమాచారం
ఇచ్చి.. 2016 జూన్‌ 15 నుంచి ఈ ఛార్జీలను వసూలు చేసినట్లు బ్యాంకు
వివరించింది.

అయితే.. 2020 జనవరి 1 తర్వాత డిజిటల్‌ లావాదేవీలపై విధించిన ఛార్జీలను
తిరిగి ఖాతాదారులకు చెల్లించాలంటూ 2020 ఆగస్టులో కేంద్ర ప్రత్యక్ష పన్నుల
బోర్డు (సీబీడీటీ) ఆదేశాలు జారీ చేసినట్లు బ్యాంకు చెప్పింది.

డిజిటల్‌ లావాదేవీలపై భవిష్యత్ లోనూ ఛార్జీలు విధించవద్దని సీబీడీటీ
బ్యాంకులకు సూచించిందని తెలిపింది. సీబీడీటీ ఆదేశాల మేరకు 2020 జనవరి 1
నుంచి 2020 సెప్టెంబర్‌ 14 వరకు జీరో బ్యాలెన్స్ ఖాతాదారుల డిజిటల్‌
లావాదేవీలపై విధించిన ఛార్జీలను రిఫండ్‌ చేసినట్లు ఎస్బీఐ తెలిపింది.

సెప్టెంబర్‌ 15, 2020 తర్వాత నెలలో నాలుగు కన్నా ఎక్కువగా నిర్వహించిన
డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పై ఎలాంటి ఛార్జీలను వసూలు చేయడం లేదని బ్యాంకు
స్పష్టం చేసింది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this