Wednesday, February 18, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
PAN Card: మీ పాన్ కార్డులో ఉండే...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

PAN Card: మీ పాన్ కార్డులో ఉండే 10 అంకెల అర్థం ఏమిటో తెలుసా..? ఆ డిజిట్స్‌లోనే పూర్తి వివరాలు ఉంటాయి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

PAN Card: ఆదాయపు పన్ను శాఖతో ప్రతి లావాదేవీకి శాశ్వత ఖాతా సంఖ్య
తప్పనిసరి చేయబడింది. బ్యాంక్ ఖాతాలను తెరవడం, బ్యాంక్ ఖాతాలో నగదు జమ
చేయడం, డీమాట్ ఖాతా తెరవడం, స్థిరమైన ఆస్తుల లావాదేవీ, సెక్యూరిటీలలో
వ్యవహరించడం వంటి అనేక ఇతర ఆర్థిక లావాదేవీలకు కూడా ఇది తప్పనిసరి.

ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే పర్మినెంట్‌ అకౌంట్‌ నెంబర్‌ అయిన పాన్‌
కార్డుపై 10 డిజిట్స్‌ ఉంటాయి. వ్యక్తిగతంగా కార్డు తీసుకున్నా.. లేదా
ఏదైనా సంస్థ తీసుకున్నా పాన్‌ నెంబర్‌లో 10 డిజిట్స్‌ ఉండటం తప్పనిసరి.
అయితే పాన్‌ నెంబర్‌లోని 10 అంకెల్లో ఒక్కో డిజిట్‌కు ఒక్కో అర్థం ఉంటుంది.
ఆ నెంబర్లకే ప్రత్యేక ఉంటుంది. ఈ విషయాలు పెద్దగా ఎవరికి తెలిసి ఉండదు.

అయితే పాన్‌ నెంబర్‌లోని మొదటి మూడు డిజిట్స్‌ AAA నుంచి ZZZ వరకు
ఉంటాయి. అది కూడా ఆల్ఫాబెటిక్ సిరీస్‌గా ఉంటాయి. నాలుగో అంకె పాన్‌
హోల్డర్‌ స్టేటస్‌ను తెలియజేస్తుంది. అయితే ఆదాయపు పన్ను శాఖ పాన్‌ కార్డు
సంస్థలతో పాటు వ్యక్తులకు జారీ చేస్తుంది. పాన్‌ హోల్డర్‌ స్టేటస్‌ను బట్టి
పాన్‌ నెంబర్‌లో నాలుగో అంకె ఉంటుంది. అవి ఎలాగంటే..

  • A- అసోసియేట్‌ ఆఫ్‌ పర్సన్స్‌
  • B – బాడీ ఆఫ్‌ ఇండివిజువల్స్‌
  • C – కంపెనీ (సంస్థ)
  • F- ఫర్మ్‌ (లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్‌షిప్)
  • G – గవర్నమెంట్‌ ఏజన్సీ (ప్రభుత్వ సంస్థ)
  • H – హిందూ అవిభాజ్య కుటుంబం (HUF)
  • J- ఆర్టిఫిషియల్‌ జ్యురిడికల్‌ పర్సన్‌
  • L – లోకల్‌ అథారిటీ
  • P – పర్సన్‌ (వ్యక్తి)
  • T – ట్రస్ట్‌ అనే ఈ లెటర్స్‌ ఉంటాయి.

వ్యక్తిగతంగా పాన్ కార్డ్ తీసుకునేవారందరికీ నాలుగో లెటర్ ‘P’ అనే
ఉంటుంది. ఇక పాన్‌ నెంబర్‌లో ఐదో లెటర్‌ దరఖాస్తుల వ్యక్తి లేదా, ఇంటి
పేరులో మొదటి అక్షరంగా ఉంటుంది. పాన్‌ నెంబర్‌లో 6 నుంచి 9వ లెటర్‌ 0001
నుంచి 9999 నెంబర్‌ మధ్య ఉంటుంది. ఇక పాన్‌ నెంబర్‌లోని 10వ డిజిట్‌ను
ఆల్ఫబెటిక్‌ చెక్‌ డిజిట్‌ అంటారు. మొదటి 9 డిజిట్స్‌కు ఫార్మూలా అప్లై
చేసి చివరి డిజిట్‌ను కంప్యూటర్‌ జెనరేట్‌ చేస్తుంది. ఇలా దరఖాస్తు దారుడు
పేరు, ఇంటి పేరు, వ్యక్తిగతంగా దరఖాస్తు చేస్తున్నాడా..? లేదా ఏదైనా
వ్యాపార సంస్థ తరపున చేస్తున్నారా.? అనే వివరాలను బట్టి ఈ 10 డిజిట్స్‌ను
క్రియేట్‌ చేస్తుంది ఆయదాపను పన్ను శాఖ.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this