Thursday, February 19, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Education Apps: మీ చిన్నారులు స్మార్ట్‌ ఫోన్‌ను...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Education Apps: మీ చిన్నారులు స్మార్ట్‌ ఫోన్‌ను వదలట్లేదా.? అయితే వారికి దాంతోనే నాలెడ్జ్‌ను ఇలా పెంచండి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Education Apps: మీ చిన్నారులు అదే పనిగా స్మార్ట్‌ ఫోన్‌
వాడుతున్నారా? వారికి అదే ఫోన్‌తో విజ్ఞానాన్ని అందించాలనుకుంటున్నారా.?
అయితే వెంటనే మీ స్మార్ట్‌ ఫోన్‌లో ఈ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయండి…

ఇటీవల స్మార్ట్‌ఫోన్‌ వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా చిన్నారులు కూడా
స్మార్ట్‌ఫోన్‌లకు అతుక్కుపోతున్నారు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌తోనే వారిలో
నాలెడ్జ్ పెంచొచ్చు. 

కొన్ని రకాల ఎడ్యుకేషన్‌ యాప్స్‌తో చిన్నారుల్లో ఆసక్తి పెంచడంతో పాటు
వారికి స్మార్ట్‌ ఫోన్‌ వాడుతున్నామన్న కోరికను తీర్చొచ్చు. అలాంటి కొన్ని
యాప్‌లపై ఓ లుక్కేయండి..

Quick Maths: చిన్నారులకు అంకెలపై ఆసక్తిని పెంచేందుకు ఈ యాప్‌ ఎంతగానో
ఉపయోగపడుతుంది. చిన్న చిన్న కూడికల నుంచి నెంబర్లను గుర్తుపట్టడం లాంటి
వాటిని చిన్నారులకు గేమ్‌లాగా నేర్పించవచ్చు.  

NSF Science Zone: నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ వారు రూపొందించిన ఈ యాప్‌ మీ
చిన్నారులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది. సైన్స్‌కు
సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇందులో అందుబాటులో ఉంచారు. 3డీ ఫొటోల రూపంలో
విజ్ఞానాన్ని అందించడం ఈ యాప్‌ మరో ప్రత్యేకత. 

English Crossword puzzle: ఈ యాప్‌ చిన్నారులతో పాటు పెద్దలకు మేదడుకు
మేతలాగా ఉపయోగపడుతుంది. మీ చిన్నారులకు వినోదాన్ని అందించడంతో పాటు
ఇంగ్లిష్‌పై పట్టు కూడా సాధించేలా చేస్తుంది.  

Lightbot: మీ చిన్నారులను భవిష్యత్తులో కోడింగ్ నిపుణులుగా
మార్చాలనుకుంటున్నారా.? అయితే ‘లైట్‌బోట్‌’ యాప్‌ బెస్ట్ ఆప్షన్‌. ఇది
చిన్నారులకు కోడింగ్‌పై బేసిక్స్‌ అందిస్తుంది.

Starfall ABCs: ప్లేస్కూల్‌కు వెళుతోన్న చిన్నారులకు ఈ యాప్‌ బాగా
ఉపయోగపడుతుంది. స్మార్ట్‌ యుగంలో మీ పిల్లలకు ABCDలను కూడా స్మార్ట్‌గా
నేర్పించవచ్చు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this