Sukanya Samriddhi PPF: సుకన్య సమృద్ధి యోజన...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

Sukanya Samriddhi PPF: సుకన్య సమృద్ధి యోజన పథకం.. పీపీఎఫ్‌లలో ఏది బేటర్‌.. రెండింటిలో తేడాలు ఏమిటీ..?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Sukanya Samriddhi PPF: తల్లిదండ్రులు తమ కూతుళ్ల కోసం దీర్ఘకాలిక
అవసరాల నిమిత్తం పొదపు పెట్టుబడి పథకాన్ని ఎంచుకునేటప్పుడు తరచుగా ఎంతో
ఆందోళనకు గురవుతుంటారు. ప్రత్యేకించి పబ్లిక్‌ ప్రావిడెంట్‌, సుకన్య
సమృద్ది యోజన పథకాల్లో దేనిలో పెట్టుబడి పెట్టాలన్న విషయమై హడావుడి
అవుతుంటారు. కూతుళ్ల విద్య, వివాహం అనేవి చాలా మంది తల్లిదండ్రుల ప్రధాన
లక్ష్యాల్లో ఒకటిగా ఉంటాయి. అయితే సుకన్య సమృద్ది, పీపీఎఫ్‌లలో ఏది బేటరో
చూద్దాం.

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌)

ఆదాయం పన్ను మినహాయింపులకు దీర్ఘకాలిక పెట్టుబడి మార్గం ప్రజాదరణ పొందిన
స్కీమ్‌ పీపీఎఫ్‌. టాక్స్‌ బెనిఫిట్లతో పాటు అధిక వడ్డీ ఆఫర్‌ చేస్తుంది.
పీపీఎఫ్‌పై వచ్చే వడ్డీ, ఇతర రిటర్నులపైనా ఆదాయం పన్ను వర్తించదు.
గరిష్టంగా 12 వాయిదాల్లో గానీ, ఒకేసారి గానీ భారీ మొత్తంలో పెట్టుబడి
స్కీమ్‌ పీపీఎఫ్‌. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 నుంచి గరిష్టంగా
రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేసేందుకు అనుతిస్తారు. పీపీఎఫ్‌ గడువు
పదిహేనేళ్లు. ప్రస్తుతం వడ్డీ రేటు 7.1 శాతం వరకు ఉంది.

సుకన్య సమృద్ది యోజన (ఎస్‌ఎస్‌వై)

సుకన్య సమృద్ది యోజన పథకాన్ని 2015లో ప్రధాని నరేంద్ర మోదీ
ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రత్యేకించి బాలికల పొదుపు పథకంగా , దీర్ఘకాలిక
పెట్టుబడి మార్గంగా అత్యంత ప్రజాదరణ పొందిన పథకం ఇది. సాధారణంగా బాలిక
పుట్టినప్పటి నుంచి 10 ఏళ్ల వరకు ఈ పథకంలో చేరవచ్చు. అయితే బాలిక
తప్పనిసరిగా భారతీయురాలై ఉండాలి.18 ఏళ్లు దాటిన తర్వాత సదరు బాలిక ఖాతాదారు
అవుతుంది. ఆమె కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఒక ఏడాదిలో
ఇన్వెస్ట్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ పథకంపై వచ్చే వడ్డీ,
మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రారంభంలో ఈ పథకంలో
పెట్టుబడిపై 8.4 శాతం వడ్డీరేటు ఆఫర్‌ చేయగా, ఇప్పుడు 7.6 శాతానికి
కుదించారు.

సుకన్య సమృద్ది-పీపీఎఫ్‌ రెండింటిని తేడాలు ఏంటీ..?

సుకన్య సమృద్ది, పీపీఎఫ్‌తో పోలిస్తే పీపీఎఫ్‌ కంటే సుకన్య సమృద్ది
పథకానికి ఎక్కువ వడ్డీరేటు లభిస్తుంది. పీపీఎఫ్‌తో పోలిస్తే భవిష్యత్తులో
వడ్డీరేటు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. బాలిక భవిష్యత్తును పరిగణలోకి
తీసుకుని డెట్‌ ఫండ్‌లోనూ ఇన్వెస్ట్‌ చేయవచ్చు. పీపీఎఫ్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌
కూడా మంచిదే. బాలిక 21 ఏళ్లు దాటిన తర్వాత సుకన్య పథకం నిలిపివేయబడుతుంది.
పీపీఎఫ్‌ 15 ఏళ్లకు మెచ్యూర్‌ అయినా, మరో ఐదేళ్లు కొనసాగించే అవకాశం
ఉంటుంది. తల్లిదండ్రులు ఏదో ఒక పథకంలో పెట్టుబడి పెట్టడానికి తరుచుగా
ప్రయత్నిస్తుంటారు. నిపుణులు మాత్రం ఒకే పథకంలో పెట్టుబడి పెట్టవద్దని
సూచిస్తున్నారు. చిన్న మొత్తాలు పీపీఎఫ్‌లోనూ ఇన్వెస్ట్‌ చేయాలని నిపుణులు
సూచిస్తున్నారు. ద్రవ్య లభ్యతకు పీపీఎఫ్‌ ఆఫర్‌ చేస్తుంది. అయితే సుకన్య
సమృద్దిలో 15 సంవత్సరాలు దాటిన తర్వాత పెట్టుబడులు అనుమతించరు. 21 ఏళ్ల
తర్వాత మెచ్యూర్‌ అవుతుంది. 18 ఏళ్ల తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి
విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ రెండు పథకాలకూ ఆదాయం పన్ను చట్టం 80 సీ సెక్షన్‌
కింద మినహాయింపు లభిస్తుంది.

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this