No Mask Fine in AP: ...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

No Mask Fine in AP: ఏపీ పోలీస్ ఆన్ డ్యూటీ.. మాస్క్ వేసుకోని వారి నుండి ఒక్కరోజే 17.34 లక్షలు వసూలు !

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

No Mask Fine in AP: ఏపీలో కరోనా కేసులు పెరగడంతో పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్ర
వ్యాప్తంగా మాస్క్ ధారణ పై పోలీసుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ
క్రమంలో శనివారం ఒక్క రోజునే మాస్కులు ధరించని 18,565 మందికి పోలీసులు ఫైన్
లు వేసి, ఫైన్ ల ద్వారా రూ. 17.34 లక్షలు వసూలు చేశారు. అత్యధికంగా
ప్రకాశం పోలీసులు రూ. 2,10,110 వసూళ్లు చేశారు. అలాగే అత్యల్పంగా రాజమండ్రి
అర్బన్ పోలీసులు రూ. 2800 వసూలు చేశారు. ఇక ఏపీలో కరోనా విలయం
సృష్టిస్తూనే ఉంది. నిన్న ఏకంగా వెయ్యికి చేరువలో వెళ్లిన కరోనా పాజిటివ్
కేసులు..ఇవాళ వెయ్యి దాటేశాయి కరోనా కేసులు. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల
చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 31,142
శాంపిల్స్ పరీక్షించగా.. 1005 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. గతేడాది
నవంబర్ 26 తర్వాత వేయి కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక గత 24 గంటల్లో
కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు. అదే సమయంలో 324 మంది కోవిడ్ నుండి
పూర్తిగా కోలుకున్నారు.. దీంతో.. ఏపీలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల
సంఖ్య 8,98,815కు చేరుకోగా.. కోలుకున్నవారి సంఖ్య 8,86,216కు పెరిగింది..
ప్రస్తుతం రాష్ట్రంలో 5394 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 7,205
మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక, ఇవాళ్టి వరకు రాష్ట్రంలో
1,49,90,039 సాంపిల్స్ ని పరీక్షించినట్టు కరోనా బులెటిన్‌లో పేర్కొంది ఏపీ
సర్కార్.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this