Google: మీ డేటా గూగుల్‌లో సురక్షితంగా ఉండాలంటే.....

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Google: మీ డేటా గూగుల్‌లో సురక్షితంగా ఉండాలంటే.. జస్ట్ ఈ ట్రిక్స్ తెలిస్తే చాలు.!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Google Security: ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్లలో గూగుల్
వాడకం సర్వ సాధారణం. గూగుల్, గూగుల్‌కు సంబంధించిన యాప్స్‌ను సెర్చింగ్‌కు
ఉపయోగిస్తే చాలు.! నేరుగా గూగుల్‌కు కనెక్ట్ అయిపోతాం. ఈ నేపధ్యంలో మన డేటా
గూగుల్‌లో సురక్షితంగా ఉంచడం చాలా అవసరం. వాస్తవానికి, మనం చాలాసార్లు
Gmail ఖాతాను వివిధ ప్రదేశాల నుంచి లాగిన్ అవుతుంటాం. లేదా కొన్ని
సందర్భాల్లో యాప్స్ ద్వారా.. డిఫరెంట్ డెస్క్‌టాప్స్ నుంచి జీమెయిల్ ఖాతాను
ఓపెన్ చేస్తాం. ఇలా చేయడం వల్ల మన డేటా కాస్తా దుర్వినియోగం అయ్యే ఛాన్స్
ఉంది. అందుకే గూగుల్ మన డేటాను ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో చెబుతూ తాజాగా ఓ
ట్వీట్ చేసింది. దానిపై క్లిక్ చేయడం ద్వారా మీ డేటా ఎంత సురక్షితంగా ఉందో
తెలుస్తుంది. జస్ట్ అక్కడ పేర్కొన్న 6 ఆప్షన్స్ ఎంచుకుంటే మీ డేటా ఎంత
సెక్యూర్‌గా ఉందో తెలుసుకోవచ్చు.

ఈ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా, మొదటిగా మీ Gmail ఖాతా ఏయే
మొబైల్స్ లేదా డెస్క్‌టాప్స్‌లో ఓపెన్ అయి ఉందో తెలుస్తుంది. వాటిల్లో
మీరు ఉపయోగించనటువంటి వాటిని “Remove” చేయండి. దాని ద్వారా ఏ డివైస్‌లో మీ
అకౌంట్ ఓపెన్ ఉంటుందో.. అది క్లోజ్ అవుతుంది.

  • దీని తరువాత, మీరు ఇటీవల చేసిన సెక్యూరిటీ యాక్టివిటీ గురించి తెలుసుకోవచ్చు. గత 28 రోజుల్లో మీ ఖాతా చేసిన టాస్క్‌లపై నిఘా ఉంచవచ్చు. అందులో మీరు చేయని టాస్క్ ఏదైనా ఉంటే, అక్కడ చూపించే ట్రిక్స్‌ను అనుసరించండి.
  • గూగుల్ మీకు సైన్-ఇన్, రికవరీ ఎంపికను కూడా ఇస్తుంది. అవసరమైతే, మీరు రిజిస్టర్డ్ ఫోన్ నంబర్, రికవరీ ఈ-మెయిల్, సెక్యూరిటీ క్వశ్చన్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
  • థర్డ్ పార్టీ యాక్సెస్, ఈ ఆప్షన్ ద్వారా, మీ Google ఖాతా నుండి ఏ వెబ్‌సైట్‌లు, యాప్స్ డేటా యాక్సెస్ కోసం అడుగుతున్నాయో చూడవచ్చు. అవసరం లేకపోతే, చిన్న క్లిక్ ద్వారా వాటిని తొలగించవచ్చు.
  • Setting Up Gmail, ఇక్కడ మీరు బ్లాక్ చేసిన జీ-మెయిల్ అకౌంట్లను చూడవచ్చు. అవసరమైతే వాటిల్లో కొన్నింటిని అన్‌-బ్లాక్ చేసుకోవచ్చు.
  • Your Saved Password, ఇక్కడ మీరు Gmail ద్వారా ఎన్ని వెబ్‌సైట్‌లలో లాగిన్ అయ్యారో తెలుసుకోవచ్చు. ఈ ప్రక్రియను కొనసాగించడం ద్వారా మీరు ఈ వెబ్‌సైట్ల పాస్‌వర్డ్‌ను కూడా మార్చవచ్చు.

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this