Gold Jewellery : చట్టప్రకారం ఒక వ్యక్తి...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

Gold Jewellery : చట్టప్రకారం ఒక వ్యక్తి దగ్గర ఇంతే బంగారం ఉండాలట..లేదంటే జప్తు తప్పదు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Gold Jewellery : ఇతర
దేశాలతో పోలిస్తే మన దేశంలో పసిడి ప్రేమికులు ఎక్కువే. ఇక్కడి ప్రజలు
వయస్సు, ఆదాయంతో సంబంధం లేకుండా ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయడానికి
ఆసక్తి చూపిస్తుంటారు. బంగారు ఆభరణాలను ధరించడం అనేది భారతీయులకు అనాదిగా
ఒక సెంటిమెంట్​గా వస్తోంది.

ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో పసిడి ప్రేమికులు ఎక్కువే. ఇక్కడి ప్రజలు
వయస్సు, ఆదాయంతో సంబంధం లేకుండా ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయడానికి
ఆసక్తి చూపిస్తుంటారు. బంగారు ఆభరణాలను ధరించడం అనేది భారతీయులకు అనాదిగా
ఒక సెంటిమెంట్​గా వస్తోంది. అందుకే, ఏవైనా పండుగలు, శుభకార్యాలు వస్తే చాలు
బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఇక మరికొందరు దీన్ని ఉత్తమ పెట్టుబడి
మార్గంగా ఎంచుకుంటారు. ఏవైనా అనుకోని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు
బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవచ్చని వారి భావన. అందుకే అలంకరణ
కోసమే కాకుండా ఫైనాన్షియల్​ ఎమర్జెన్సీ కోసం కూడా బంగారాన్ని కొనుగోలు
చేస్తుంటారు. డబ్బులు ఉన్నప్పుడల్లా బంగారం కొని ఇంట్లో దాచేస్తుంటారు.
అయితే, ఇలా ఎంత పడితే అంత బంగారం కొనుగోలు చేయవచ్చా? చట్టబద్దంగా ఒక
వ్యక్తి వద్ద ఎంత బంగారం ఉండాలి? ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుంది? అనే
ప్రశ్నలకు చాలా మందికి సమాధానం తెలియదు. వాటి గురించి ప్రతి ఒక్కరు అవగాహన
పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం, నల్లధనాన్ని వెలికి తీయడానికి మోడీ
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆదాయపు పన్ను చట్టాల్లో కీలక
మార్పులు చోటుచేసుకున్నాయి. 

ఈ నేపథ్యంలో బంగారం నిల్వలపై అందరి దృష్టి నెలకొంది. ఆదాయపు పన్ను చట్టం,
1961లోని సెక్షన్ 132 ప్రకారం ఆదాయ పన్ను అధికారులు తనిఖీలు జరిపినప్పుడు
లెక్క చూపని ఆభరణాలను లేదా ముడి బంగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే
అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర లెక్కకు మించిన బంగారం ఉంటే వాటి
కొనుగోలు/గిఫ్ట్​కు సంబంధించిన డాక్యుమెంట్​ ప్రూఫ్స్​ను అధికారులకు
చూపించాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో మీ వద్ద ఎంత ఎన్నా సరే జప్తు
చేయరు.

పరిమితికి మించి బంగారం ఉంటే?

కాగా, బంగారం పరిమితికి సంబంధించిన విషయాన్ని సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​
డైరెక్ట్​ ట్యాక్సెస్​ (సీబీడీటీ) గతంలోనే వెల్లడించింది. దీనిపై డెలాయిట్
ఇండియా భాగస్వామి సుధాకర్ సేతురామన్ మాట్లాడుతూ ‘‘ఆదాయపు పన్ను అధికారులు
తనిఖీ నిర్వహించే సమయంలో మీ ఇంట్లో ఉన్న బంగారానికి కొనుగోలు /
ఎక్స్​ఛేంజ్​ ఇన్వాయిస్‌లు చూపించాలి. ఒకవేళ మీకు పూర్వీకుల నుంచి
వారసత్వంగా వచ్చిన ఆభరణాలైతే బహుమతి దస్తావేజులను చూపించాల్సి ఉంటుంది.
వారసత్వ బంగారానికి 1994 మే 11 నాటి CBDT చట్టంలోని సూచన నెం .1916 రక్షణగా
నిలుస్తుంది. లెక్కలో చూపని బంగారాన్ని జప్తు చేసే అధికారం ఆదాయపు పన్ను
శాఖ అధికారులకు ఉంటుంది.” అని ఆయన చెప్పారు. అయితే, డాక్యుమెంట్స్​
ప్రూఫ్స్​ లేకపోయినప్పటికీ ఒక వ్యక్తి కొంత బంగారం కలిగి ఉండేందుకు అనుమతి
ఉంటుంది. పరిమితికి లోబడి ఉండే బంగారాన్ని జప్తు చేయబోమని ఆర్థిక మంత్రిత్వ
శాఖ స్పష్టం చేసింది. 

పెళ్లైన మహిళలు 500 గ్రాముల బంగారం, పెళ్లి కాని మహిళలు 250 గ్రాముల
బంగారాన్ని కలిగి ఉండవచ్చు. అలాగే, మగవారు తమ వద్ద 100 గ్రాముల బంగారాన్ని
కలిగి ఉండవచ్చు. వీటిని కుటుంబ ఆచారాలు, సంప్రదాయాలతో సహా వివిధ కారణాల
ఆధారంగా స్వాధీనం చేసుకోకూడదని చట్టం చెబుతోంది. ఈ పరిమితికి మించి మీ వద్ద
లెక్కల్లో చూపని బంగారు ఆభరాణాలుంటే, వాటిని జప్తు చేసే అధికారం సంబంధిత
అధికారులకు ఉంటుంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this