ఇటీవల పెట్రోల్, డీజిల్
ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. హైదరాబాద్ లో
గ్యాస్ సిలిండర్ ధర రూ. 870 గా ఉంది. అయితే గ్యాస్ సిలిండర్ ను ఇలా బుక్
చేస్తే రూ. 170 కే పొందొచ్చు.
ఇటీవల దేశీయ వంట గ్యాస్ సిలిండర్ల ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న
విషయం తెలిసింది. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.870కి చేరడంతో గ్యాస్ అంటేనే
గడగడలాడే పరిస్థితి ఏర్పడింది.
ఈ తరుణంలో ప్రముఖ పేమెంట్ యాప్ Paytm వినియోగదారులకు సూపర్ ఆఫర్
అందిస్తోంది. ఏకంగా గ్యాస్ బుకింగ్ పై రూ.700 వరకు క్యాష్ బ్యాక్ అందుకునే
అవకాశాన్ని కల్పిస్తోంది. మీరు కూడా ఈ క్యాస్ బ్యాక్ అందుకోవాలంటే ఈ
స్టెప్స్ ఫాలో అవ్వండి..
1. ముందుగా Paytm యాప్ ఓపెన్ చేయండి.
2. అనంతరం “రీఛార్జ్ అండ్ పే బిల్” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3. తర్వాత ‘బుక్ గ్యాస్ సిలిండర్’ ఆప్షన్ ను ఎంచుకోండి.
4. అనంతరం మీరు వాడే సిలిండర్ కంపెనీని ఎంచుకోండి.
5. రిజిస్టర్ మొబైల్ నంబర్ లేదా మీ ఎల్‌పిజి ఐడిని నమోదు చేయండి. అనంతరం బిల్ పే చేసి సిలిండర్ ను బుక్ చేసుకోవచ్చు.
6. ఇలా బుక్ చేసుకున్న 24 గంటల్లో మీకు రూ. 700 వరకు విలువ కలిగిన క్యాష్
బ్యాక్ స్క్రాచ్ కార్డు వస్తుంది. ఈ కార్డును 7 రోజుల్లోగా ఉపయోగించాల్సి
ఉంటుంది.
7. అయితే మొదటి సారి పేటిఎం ద్వారా గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులకే ఈ ఆఫర్ అందుతుంది.
అయితే ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే మరో ఏడు రోజులు మాత్రమే..
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.