Electricity Charges in AP: ఏపీలో కొత్త...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Electricity Charges in AP: ఏపీలో కొత్త విద్యుత్ ఛార్జీలు ఇవే.. వారికి ఉరటనిచ్చిన ప్రభుత్వం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Electricity Charges in AP: ఆంధ్రప్రదేశ్ (Andhra
Pradesh) లో నూతన విద్యుత్ ఛార్జీలను (Electricity Charges) ఏపీఈఆర్సీ
ప్రకటించింది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో నూతన ఛార్జీలు అమల్లోకి
రానున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ లో నూతన విద్యుత్ ఛార్జీలను ఈఆర్సీ ప్రకటిచింది. రాయితీలను
తగ్గించకుండా.. చిన్నచిన్న మార్పులతో కొత్త విద్యుత్ టారిఫ్ ను ఏపీ ఈఆర్సీ
ఛైర్మన్ నాగార్జున రెడ్డి ప్రకటించారు.

నూతన టారిఫ్ లో ముఖ్యంగా గృహ వినియోగదారులకు ఇకపై కనీస ఛార్జీలు ఉండవని
ప్రకటించింది. కనీస ఛార్జీల స్తానంలో ఇకపై కిలో వాట్ కు రూ.10 చెల్లిస్తే
సరిపోతుందని నాగార్జున రెడ్డి తెలిపారు. అలాగే సగటు యూనిట్ ధర రూ.7.17
నుంచి రూ.6.37కు తగ్గిస్తున్నట్టు నాగార్జున రెడ్డి వెల్లడించారు.

ఇక ఎస్సీ, ఎస్టీ కాలనీలు, కులవృత్తులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కొనసాగనుంది.
దీని వల్ల ప్రభుత్వంపై రూ.1,657 కోట్ల భారం పడనుంది. అలాగే ఫంక్షన్ హాళ్లకు
ఇకపై ఫిక్స్డ్ ఛార్జీలుండవని నాగార్జున రెడ్డి స్పష్టం చేశారు.

ఉచిత విద్యుత్ కేటగిరీ విషయానికి వస్తే గిరిజనులు, ఎస్సీ కాలనీల్లో నెలకు
200 యూనిట్లు, లాండ్రీలు నడుపుతున్న రజకులకు నెలకు 150 యూనిట్లు, చేనేత
కార్మికులు, బీపీఎల్ కింద ఉన్న స్వర్ణ వృత్తికారులకు నెలకు 100 యూనిట్లు,
అత్యంత వెనుకబడిన వర్గాలకు నెలకు 100 యూనిట్లు ఉచితంగా ఇవ్వనున్నారు.

పరిశ్రమల కేటగిరీలో ఆక్వా, పౌల్ట్రీ రంగాలను చేర్చే అవకాశం లేదని నాగార్జున
రెడ్డి స్పష్టం చేశారు. ఇక రైతులకు ఉచిత విద్యుత్‌ పథకం కింద రూ.7,297
కోట్లు భరించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు ఆయన తెలిపారు.

ప్రతి ఏటా డిస్కమ్ లకు రూ.11,741.18 లోటు వస్తుందని.., ఇందులో రూ.4,307.38
కోట్ల భారం వినియోగదారులు, ప్రభుత్వంపై పడకుండా ఉండే ప్రతిపాదనలను
ఆమోదించినట్లు తెలిపారు.

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this