Credit Card Limit: క్రెడిట్ కార్డ్ లిమిట్...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Credit Card Limit: క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకుంటే లాభమా? నష్టమా? తెలుసుకోండి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Credit Card Limit | మీరు
క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత? మీ క్రెడిట్
కార్డ్ లిమిట్‌ను పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి.

1. అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునే క్రెడిట్ కార్డ్ ఆదుకుంటుంది. కానీ
క్రెడిట్ కార్డును దుబారా ఖర్చులకు వాడి ఆ తర్వాత అప్పులపాలయ్యేవారు
ఉంటారు. క్రెడిట్ కార్డును సరిగ్గా వాడితే చాలా లాభాలున్నాయి. ప్రతీ
క్రెడిట్ కార్డుకు క్రెడిట్ లిమిట్‌ను ఫిక్స్ చేస్తాయి బ్యాంకులు. ఈ
క్రెడిట్ లిమిట్ కస్టమర్ క్రెడిట్ హిస్టరీ, సిబిల్ స్కోర్‌పైన ఆధారపడి
ఉంటుంది.

2. కొందరికి రూ.50,000 క్రెడిట్ లిమిట్ ఉండొచ్చు. ఇంకొందరికి రూ.5,00,000
లిమిట్ ఉండొచ్చు. ఇది వారి ఆదాయం, గతంలో తీసుకున్న లోన్స్ చెల్లించిన తీరు,
సిబిల్ స్కోర్‌పై ఆధార పడి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ లిమిట్ మొదట ఎవరికైనా
తక్కువగానే ఉంటుంది. ఆ తర్వాత బ్యాంకులు క్రెడిట్ లిమిట్ పెంచుతూ ఉంటాయి.

3. క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉంటే అప్పులపాలవుతామన్న ఆందోళన కస్టమర్లలో
ఉంటుంది. లిమిట్ ఎక్కువగా ఉన్నా మొత్తం వాడి బిల్లు చెల్లించకపోతేనే
అప్పులపాలవుతారు. అందుకే క్రెడిట్ కార్డును ఉపయోగించే విషయంలో కంట్రోల్
ఉండాలి. లిమిట్ ఉంది కదా అని వాడేస్తే ఇబ్బందులపాలవ్వాల్సి వస్తుంది.

4. క్రెడిట్ హిస్టరీ బాగా ఉన్న కస్టమర్లకు క్రెడిట్ లిమిట్ పెంచేందుకు
బ్యాంకులు సుముఖత చూపిస్తాయి. ఎస్ఎంఎస్, ఇమెయిల్, ఫోన్ ద్వారా సమాచారం
ఇస్తాయి. మరి బ్యాంకులు క్రెడిట్ లిమిట్ పెంచుతామని ఆఫర్ ఇస్తే మీరు
అంగీకరించాలా వద్దా అన్న డైలమా కస్టమర్లలో ఉంటుంది. మరి క్రెడిట్ లిమిట్
పెంచుకుంటే లాభాలేంటో, నష్టాలేంటో తెలుసుకోండి.

5. క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోవడం వల్ల ఉపయోగాలున్నాయి. బ్యాంకులు మీకు
క్రెడిట్ లిమిట్ పెంచుతామని ఆఫర్ ఇచ్చాయంటే మీ క్రెడిట్ హిస్టరీ
బాగున్నట్టే. మీరు క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకుంటే మీ క్రెడిట్ స్కోర్
కూడా పెరుగుతుంది. మీ క్రెడిట్ స్కోర్‌ను క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో కూడా
ప్రభావితం చేస్తుంది.

6. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో 30 శాతం లోపే ఉండాలని చెబుతుంటారు ఆర్థిక
నిపుణులు. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో ఉంటే మీకు ఉన్న లిమిట్‌లో ఎంత శాతం
వాడారని లెక్కిస్తారు. అంటే మీ క్రెడిట్ లిమిట్ రూ.1,00,000 అనుకుందాం.
మీరు రూ.30,000 లోపు వాడితే మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో బాగున్నట్టు.

7. అంతకన్నా ఎక్కువ వాడితే మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపిస్తుంది.
మీరు క్రెడిట్ కార్డ్ లిమిట్ పెరిగితే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో కూడా
పెంచుకోవచ్చు. క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉంటే అత్యవసర పరిస్థితుల్లో
ఇబ్బందులు పడాల్సిన అవసరం రాదు.

8. ఇక క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎక్కువగా ఉంటే మీరు అంతే మొత్తం క్రెడిట్
కార్డుపై లోన్ తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎక్కువగా ఉండటం వల్ల
నష్టాలు కూడా ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ లిమిట్ ఉంది కదా అని ఎక్కువగా
క్రెడిట్ కార్డ్ వాడేస్తే అప్పుల్లో కూరుకుపోవాల్సి వస్తుంది.  

9. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించలేనప్పుడు మినిమమ్ పేమెంట్ చేయడం, అధిక
వడ్డీ చెల్లించడం లాంటి సమస్యలు ఉంటాయి. ఇక క్రెడిట్ కార్డ్ లిమిట్
ఎక్కువగా ఉంటే మీ కార్డు పోయినా, ఎవరైనా దొంగిలించినా ఎక్కువగా
నష్టపోవాల్సి వస్తుంది. ఒకవేళ మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎక్కువగా ఉంటే
ట్రాన్సాక్షన్ లిమిట్ తక్కువగా పెట్టుకోవడం ద్వారా నష్టాన్ని తగ్గించొచ్చు.

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this