Friday, February 13, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Corona: 50వేలకు చేరువగా కేసులు..200పైబడ్డ మృతులు

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Corona: 50వేలకు చేరువగా కేసులు..200పైబడ్డ మృతులు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
  • 30వేల పైచిలుకు కేసులు మహారాష్ట్రలోనే

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి ఆందోళనకరంగా ఉంది. రోజూవారీ కేసులు 50వేలకు చేరువవుతుండగా.. మరణాలు 200కు పైబడ్డాయి. ఆదివారం 8,80,655 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..46,951 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం దేశంలో నవంబర్‌ ప్రారంభం నాటి విజృంభణ కనిపిస్తోంది. ఈ మహ్మమారి కారణంగా తాజాగా 212 మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా 1,16,46,081 కోట్ల మంది వైరస్ బారినపడగా.. 1,59,967 మంది మృత్యుఒడికి చేరుకున్నారని సోమవారం కేంద్రం వెల్లడించింది.

కరోనా కొత్త కేసుల కారణంగా క్రియాశీల రేటు పెరుగుతోంది. నిన్నటి వరకు 3,34,646 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 2.66 శాతానికి చేరింది. గడిచిన 24 గంటల్లో 21,180 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. పాజిటివ్ కేసుల్లో రికవరీలు సగం కంటే తక్కువగా ఉండటం ఆందోళనకలిగిస్తోంది. ఇప్పటి వరకు 1.11 కోట్ల మందికి పైగా వైరస్ నుంచి బయటపడగా.. రికవరీ రేటు 95.96 శాతానికి తగ్గింది.

మహారాష్ట్రను పీడిస్తోన్న మహమ్మారి..

మహారాష్ట్ర కరోనా మహమ్మారి గుప్పిట చిక్కుకుపోయింది. గడిచిన 24 గంటల్లో అక్కడ 30,535 కొత్త కేసులు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 46,951గా ఉండగా.. ఒక్క ఆ రాష్ట్రంలోనే 30వేల పై చిలుకు కేసులు బయటపడ్డాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 24లక్షల మార్కును దాటింది. తాజాగా 99 మంది మృత్యుఒడికి చేరగా..నిన్నటి వరకు 53,399 మంది ప్రాణాలు వదిలారు. అక్కడ 22,14,867 రికవరీలు.. 2,11,416 క్రియాశీల కేసులున్నాయి. ఆర్థిక రాజధాని ముంబయిలో 3,779 మంది వైరస్ బారినపడ్డారు.

4.50కోట్ల మందికి టీకాలు..

కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టీకా కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతోంది. మార్చి 21న 4,62,157 మంది టీకాలు వేయించుకున్నారు. దాంతో ఇప్పటి వరకు టీకాలు తీసుకున్నవారి సంఖ్య 4,50,65,998కి చేరుకుంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this