Bank Holidays : బ్యాంకు ఖాతాదారులకు న్యూస్.....

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

Bank Holidays : బ్యాంకు ఖాతాదారులకు న్యూస్.. మార్చి 27 నుంచి వరుస హాలిడేస్.. ఎన్ని రోజులో తెలుసా..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Bank Holidays : మీకు బ్యాంకులో ఏమైనా పని ఉందా.. అయితే తొందరగా
కంప్లీట్ చేసుకోండి.. లేదంటే రోజులతరబడి వేచి చూడక తప్పదు. ఎందుకంటే మార్చి
27 నుంచి వరుస సెలవులు వస్తున్నాయి. బ్యాంకు ఖాతాదారులు ఈ విషయాన్ని
గమనించాలి. మార్చి 27 నుంచి ఏప్రిల్ 4 మధ్య కేవలం రెండు రోజులు మాత్రమే
బ్యాంకులు పనిచేస్తాయి. మిగతా రోజులన్ని సెలవుదినాలే.. ఏ ఏ రోజు సెలవు
దినాలు వస్తున్నాయో ఇప్పుడు చూద్దాం..

ఆర్బీఐ బ్యాంక్ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. భారతదేశం అంతటా రెండో
శనివారం, హోలీ పండుగ సందర్భంగా మార్చి 27-29 వరకు మూడు రోజులు బ్యాంకులు
వరుసగా మూసివేస్తారు. మార్చి 30 సెలవుదినం కావడంతో పాట్నాలోని బ్యాంక్
శాఖలు వరుసగా నాలుగు రోజులు మూసివేస్తారు. ఇక మార్చి 31 అధికారిక సెలవుదినం
కానప్పటికీ, ఇది ఆర్థిక సంవత్సరం చివరి రోజు కాబట్టి వినియోగదారులకు
ఎటువంటి పనులను చేయరు. ఏప్రిల్ 1 ఖాతాలు మూసివేయడానికి కూడా హాలిడే
ప్రకటించారు. ఇక ఏప్రిల్ 2 గుడ్‌ఫైడే సందర్భంగా బ్యాంకులకు సెలవు. కనుక
దేశవ్యాప్తంగా బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. దీంతో ఖాతాదారులు
గమనించి తొందరగా పనిచేసుకుంటే మంచిది.

మార్చి బ్యాంక్ సెలవులు: 27 మార్చి చివరి శనివారం, 28
మార్చి ఆదివారం, 29 మార్చి హోలీ హాలిడే. పాట్నా శాఖలో మార్చి 30 సెలవు, 31
మార్చి ఆర్థిక సంవత్సరం ముగింపు

ఏప్రిల్ బ్యాంక్ సెలవులు: ఏప్రిల్ 1 బ్యాంకులు తమ
వార్షిక ఖాతాలను మూసివేయడానికి వీలు కల్పించడం చేస్తాయి. ఏప్రిల్ 2 గుడ్
ఫ్రైడే, ఏప్రిల్ 5 బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు, ఏప్రిల్ 13 గుధి పాద్వా
/ తెలుగు నూతన సంవత్సర దినోత్సవం / ఉగాది పండుగ , ఏప్రిల్ 14 డాక్టర్
బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, తమిళ నూతన సంవత్సర దినోత్సవం / విజు / బిజు
పండుగ / చెయిరోబా / బోహాగ్ బిహు, ఏప్రిల్ 15 హిమాచల్ డే / బెంగాలీ నూతన
సంవత్సర దినోత్సవం / బోహాగ్ బిహు / సర్హుల్, ఏప్రిల్ 16 బోహాగ్ బిహు,
ఏప్రిల్ 21 శ్రీ రామనవమి, గారియా పూజ


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this